Alumni Reunion
Alumni Reunion | 58 ఏళ్లకు కలిసిన పూర్వ విద్యార్థులు

అక్షరటుడే, ఆర్మూర్‌: Alumni Reunion | ఆర్మూర్‌ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 1966–67 బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థులు 58 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు.

ఈ సందర్భంగా తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు. అలాగే తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చిట్ల పార్థసారధి, అధ్యక్షుడిగా రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ మోహన్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్, కోశాధికారిగా రిటైర్డ్‌ బ్యాంకు క్యాషియర్‌ మధుసూదన్‌ నియమితులయ్యారు. కార్యక్రమంలో ప్రస్తుత హెచ్‌ఎం లక్ష్మీ నర్సయ్య, భూమేశ్వర్, రాజేందర్, గంగనర్సయ్య, వినాయక్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.