ePaper
More
    HomeసినిమాBala Krishna | ఈ వ‌య‌స్సులో కూడా త‌గ్గనంటున్న బాల‌య్య‌.. క్రేజీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్ ఖుష్‌

    Bala Krishna | ఈ వ‌య‌స్సులో కూడా త‌గ్గనంటున్న బాల‌య్య‌.. క్రేజీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్ ఖుష్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య (Bala Krishna) వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఆయ‌నలో జోష్ త‌గ్గ‌డం లేదు. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం పంచుతున్నారు. తాజాగా ఆయన కొత్త మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopi chand Malineni) డైరెక్షన్‌లో బాలకృష్ణ (Balakrishna) తర్వాత మూవీ చేయబోతున్నారు. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ రోజు కొత్త మూవీ ‘NBK 111’ ప్రకటన చేశారు మేకర్స్. ఇప్పటివరకూ మాస్ ఎంటర్‌టైనర్ జానర్‌లో మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మరోసారి బాలయ్యతో జత కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ (Box office) వద్ద భారీ విజయం అందుకుంది.

    Bala Krishna | వ‌రుస అప్‌డేట్స్..

    చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై (Vridhi movie banner) వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగివస్తుంది. చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది.’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఉగ్రరూపంలో ఉన్న సింహం ఓ వైపు.. లోహంతో ఉండే కవచం మరోవైపు ఉన్న పోస్టర్ చూస్తుంటే బాల‌య్య ఫ్యాన్స్ కి పూన‌కాలు వ‌స్తున్నాయి. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో ఆరితేరిన గోపీచంద్ మలినేని (Gopichand malineni) ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జానర్‌లో మూవీ తీయబోతున్నారు. ఇందులో గ‌తంలో ఎప్పుడు చూడని రీతిలో బాలయ్య (Ballaya) కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. హిస్టరీ హై ఆక్టేన్ యాక్షన్ కలిపి ఓ హిస్టారికల్ ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’ (Veerasimha reddy) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ (Akhanda 2) మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్‌పై తాజాగా మూవీ టీం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే (Birthday) సందర్భంగా ఒక రోజు ముందుగానే టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపింది. ఈ నెల 9న సాయంత్రం 06:03 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడించింది. ‘దైవిక ఉగ్రత కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే టీజర్ మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...