ePaper
More
    Homeబిజినెస్​Car Sales | మార్కెట్​ రారాజు ‘మారుతి’యే.. మేలో ఎన్నికార్లు కొన్నారో తెలుసా?

    Car Sales | మార్కెట్​ రారాజు ‘మారుతి’యే.. మేలో ఎన్నికార్లు కొన్నారో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Car Sales | భారత్(Bharat)​లో కార్ల కొనుగోళ్లు కొంతకాలంగా పెరుగుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలకు (Middle Class Families) చెందిన వారు గతంలో బైక్​లతో జీవితాన్ని నెట్టుకు వచ్చేవారు.

    కానీ.. మారుతున్న కాలంతో పాటు వారు కూడా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్నాళ్ల క్రితం ధనవంతులకే పరిమితమైన కార్లు ఇప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుత కార్ల మార్కెట్​లో మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ అగ్రభాగాన ఉంది. 2025 మే నెలలో ఆ కంపెనీ 1,35,962 కార్లు విక్రయించడం గమనార్హం.

    గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్లు అంతగా ఉండేవి కావు. ఉన్నా ఊరికి ఒకటో రెండో ఉంటే గొప్ప..! కానీ, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. మధ్య తరగతి వారు కూడా కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్​లో వాహనరుణాలు విరివిగా దొరుకుతుండటం కూడా కార్ల విక్రయాలు పెరగడానికి కారణం.

    Car Sales | కార్ల విక్రయాల వివరాలు..

    దేశంలో మారుతి సుజుకి, మహీంద్రా, టాటా, హ్యుందాయ్ లాంటి అనేక కార్ల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రజలు ఎక్కువగా మారుతి కార్లను కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండటం కూడా వీటి విక్రయాలు అధికంగా ఉండటానికి ఒక కారణం. గత నెలలో మారుతి సుజుకి 1,35,962 కార్లను విక్రయించింది. మహీంద్రా 52,431, హ్యుందాయ్ 43,861, టాటా మోటార్స్​ 41,557, టయోటా 29,280, కియా మోటార్స్​ 22,315, స్కోడా 6,740, ఎంజీ మోటార్స్​ 6,304 కార్లను అమ్మాయి. హోండా 3,950, వోక్స్​వాగన్​ 2,848, రెనాల్ట్ 2,502, నిస్సాన్​ 1,354, సిట్రోయెన్ 333 కార్లను విక్రయించాయి.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...