అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగు బంటి(Bear) మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి పరిధిలోని ఫారెస్ట్ నర్సరీ (Indalwai Forest Nursery) సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ (FRO Ravi Mohan Bhutt) తెలిపారు. మృత్ చెందిన ఎలుగుబంటికి ఇందల్వాయి ఫారెస్ట్ నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
