అక్షరటుడే, వెబ్డెస్క్: Today gold price | ఇటీవల బంగారం ధరల్లో(Gold rate) హెచ్చుతగ్గులు గమనిస్తూ ఉన్నాం. బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి భారత దేశ సంస్కృతిలో ఓ ప్రత్యేక స్థానముంది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలోనే ఎక్కువ బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వెళుతున్న ధరలు శనివారం తగ్గాయి. గత నెల మొదట్లో లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు రూ.97వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భవిష్యత్తు మళ్లీ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది.
Today gold price | కాస్త తగ్గిన ధరలు..
జూన్ 8న బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా రూ.1600కుపైగా తగ్గుముఖం పట్టింది. ఇటీవల లక్ష రూపాయలు దాటి బంగారం ధర.. క్రమంగా దిగి వచ్చింది. మళ్లీ రూ.లక్షకు చేరువలో ఉండగా, ఈ రోజు మాత్రం భారీగానే దిగి వచ్చింది. హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,000 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీలో(Delhi) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,120 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల తులం ధర 89,950 రూపాయలు ఉంది.
ఇక ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,000 రూపాయల వద్ద ఉంది. బెంగళూరులో(Bangalore) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,800 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర లక్షా 8 వేల రూపాయల వద్ద ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో లక్షా 18 వేల వరకు ఉంది. అయితే ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి.