అక్షరటుడే, ఇందూరు: Covid case :నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో కరోనా(Corona) పాజిటివ్ కేసు వెలుగుచూసింది. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కాలనీ(Ambedkar Colony)కి చెందిన ఓ వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం కావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)Government General Hospital – GGHకు వచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్టు(rapid test) చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది.
సూపరింటెండెంట్(Superintendent) డాక్టర్ శ్రీనివాసుకు వైద్యులు సమాచారం అందించడంతో జీజీహెచ్ 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2020 లో కూడా సదరు వ్యక్తికి కొవిడ్ సోకినట్లు సమాచారం.