ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica Visa | అక్రమ డిగ్రీ పట్టాలతో అమెరికా వీసా.. నల్గొండ విద్యార్థి అరెస్టు

    America Visa | అక్రమ డిగ్రీ పట్టాలతో అమెరికా వీసా.. నల్గొండ విద్యార్థి అరెస్టు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: America Visa : అమెరికాలో అక్రమ విద్యాపత్రాలతో వీసా పొందిన కేసులో తెలంగాణలోని నల్గొండ జిల్లా(Nalgonda district)కు చెందిన యువకుడు అరెస్టు అయ్యాడు. హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport)లో పాకీరు గోపాల్ రెడ్డి(28)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల(illegal educational documents)ను గుర్తించి అతడిని అమెరికా అధికారులు దేశం నుంచి డిపోర్ట్ చేశారు. ఈ యువకుడు అమెరికా(America)లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లాడు. కానీ, అకడమిక్ నిష్పత్తులు సరిపోకపోవటంతో హైదరాబాద్‌లోని ధనలక్ష్మి ఓవర్సీస్ కన్సల్టెన్సీ(Dhanalakshmi Overseas Consultancy) ద్వారా నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలు సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    గోపాల్ రెడ్డి కాలిఫోర్నియా(California)లో ప్రవేశం కోసం ప్రయత్నించాడు. అమెరికా వీసా దరఖాస్తులో తప్పుడు విద్యా పత్రాలను సమర్పించినట్లు గుర్తించిన యూస్​ అధికారులు.. ఆ యువకుడిని జూన్ 1న భారత్‌కు పంపించేశారు. ఈ మేరకు భారత ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఆర్‌జీఐఏ వద్ద యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

    నకిలీ డిగ్రీ పట్టాలు సిద్ధం చేసిన కన్సల్టెన్సీపై కూడా దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ధనలక్ష్మి కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో విదేశీ విద్యకు వెళ్లే ప్రయత్నాలు చట్టపరంగా శిక్షార్హమైనవని పోలీసులు హెచ్చరించారు. తదుపరి విచారణ నిమిత్తం గోపాల్ రెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. కాగా.. విదేశీ విద్యార్ధులు నిజమైన డాక్యుమెంట్లతోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...