ePaper
More
    Homeభక్తిTTD Srivari Laddu | శ్రీవారి లడ్డూకు జిరాక్స్ కాపీలు.. చెక్​ పెట్టేందుకు టీటీడీ చర్యలు

    TTD Srivari Laddu | శ్రీవారి లడ్డూకు జిరాక్స్ కాపీలు.. చెక్​ పెట్టేందుకు టీటీడీ చర్యలు

    Published on

    అక్షరటుడే, తిరుమల: TTD Srivari Laddu : తిరుమల తిరుపతి లడ్డూ(Tirumala Tirupati Laddu).. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండే ప్రత్యేకం. ఎందుకంటే అది కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక సెంటిమెంట్‌. అంతటి ప్రాధాన్యం ఉన్న లడ్డూని.. మరొకరు కాపీ కొడితే వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేకత ఏముంటుంది?

    నకిలీరాయుళ్లకు టీటీడీ లడ్డూ ఫార్ములా(TTD Laddu formula) దొరక్కుండా తిరుమల తిరుపతి దేవస్థానం జీఐ ట్యాగింగ్‌ చేయించింది. అయినా, కొన్ని సంస్థలు ఇంకా యథేచ్ఛగా కాపీ కొట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అసలీ లడ్డూపై జీఐ ట్యాగింగ్‌ ఏమిటీ..? దానిని ఎలా ఉల్లంఘిస్తున్నారో చూద్దాం.

    వేంకన్నకు ప్రీతిపాత్రమైన లడ్డూ ఏడు కొండలంత కీర్తిని సొంతం చేసుకుని, విశ్వవ్యాప్తంగా విస్తరించింది. పేటెంట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం(Geographical Indications of Goods Act) కింద జీఐ రిజిస్ట్రీ(GI registry)లో సైతం స్థానం సంపాదించుకుంది.

    కానీ, కొన్ని మిఠాయి దుకాణాల్లో తిరుమల లడ్డూ పేరు వినిపించడంతో టీటీడీ సీరియస్​గా స్టెప్స్ వేస్తోంది. దేశ, విదేశాల్లో ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్, నేరుగా తిరుమల లడ్డూ పేరుతో జరుగుతున్న విక్రయాలపై కొరడా ఝలిపించింది. కోట్లాది భక్తుల సెంటిమెంట్‌ లడ్డూ పవిత్రతను కాపాడేందుకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

    కల్తీ నెయ్యి వివాదం సమిసిపోతుందనుకుంటున్న తరుణంలో మార్కెట్‌లో తిరుమల వేంకన్న లడ్డూకు జిరాక్స్‌ కాపీలు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. అమృతతుల్యమైన వేంకటేశ్వర స్వామి లడ్డూను కొందరు.. తమ వ్యాపారాల కోసం వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(g the nectar-like Venkateswara Swamy Laddu for their businesses. The Tirumala Tirupati Devasthanam Board) తీవ్రంగా పరిగణిస్తోంది. లడ్డూ పవిత్రతను, దానికోసం ఏర్పాటు చేసిన జీఐ టెక్నాలజీ(GI technology)ని కాపాడేందుకు కఠినచర్యలకు ఉపక్రమిస్తోంది.

    తిరుపతి లడ్డూ రుచి, మరే ఇతర ప్రసాదాల్లో కనిపించదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంతటి ప్రాధాన్యం శ్రీవారి ప్రసాదానికి ఉంది. ఈ ప్రత్యేకత, పవిత్రతను కోల్పోకుండా.. శ్రీవారి లడ్డూకు టీటీడీ జీఐ ట్యాగింగ్‌ చేయించింది.

    కానీ, వేంకటేశ్వర స్వామి లడ్డూకు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి.. పలు సంస్థలు నకిలీ లడ్డూలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి, టీటీడీ నోటీసులు జారీ చేసింది. పుష్‌ మై కార్ట్(Push My Cart), ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్‌(Transact Foods Limited) సహా పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలు తిరుపతి లడ్డూలంటూ ఆన్‌లైన్‌లో యథేచ్ఛగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు విచారణలో తేటతెల్లం అయింది.

    తిరుపతి లడ్డూలను ఎవరూ కాపీ కొట్టకుండా.. జియోగ్రాఫికల్‌ ఐండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌ చట్టం(Geographical Indications of Goods Act) ప్రకారం, జీఐ(GI) హక్కులను సాధించింది టీటీడీ(TTD). దీని ప్రకారం ఎవరు తిరుపతి లడ్డూను నకిలీ తయారుచేసినా.. శిక్షార్హులవుతారు. ప్రస్తుతం ఆ చట్టం ప్రకారమే.. సదరు సంస్థలకు నోటీసులు పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ హక్కుల్ని ఉల్లంఘిస్తూ .. తిరుమల వెంకన్న లడ్డూల పేరిట, తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థలపై కొరడా ఝళిపించింది. వారిపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది.

    తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చాలా నగరాల్లో ఆలయాలు నిర్వహించబడుతున్నాయి. ఆయా ఆలయాల్లో తిరుపతి లడ్డూను కూడా టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. కానీ, లడ్డూల తయారీ మాత్రం.. ఒక్క తిరుమలలోని స్వామివారి సన్నిధిలోనే జరుగుతోంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ లడ్డూ ప్రత్యేకత దెబ్బ తినకుండా… జీఐ ట్యాగింగ్‌ (GI tagging) చేసినప్పటికీ, నకిలీ కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయింది. ఆన్‌లైన్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

    టీటీడీ తాజా చేపట్టిన చర్యలకు ఇతర సంస్థలు సైతం తమ మెనూ లిస్టులోంచి తిరుపతి లడ్డూను పోలిన ఉత్పత్తులను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల నమ్మకాన్ని, స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఎంతటి కఠినచర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...