అక్షరటుడే, కామారెడ్డి: RTC Special Buses | కామారెడ్డి నుంచి ఈనెల 27 నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీ బస్సులు ప్రారంభిస్తున్నామని డిపో (Kamareddy RTC Depot) మేనేజర్ కరుణశ్రీ శనివారం తెలిపారు. కామారెడ్డి నుంచి వరంగల్ (Warangal) వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం (Bhadrakali Temple), రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు వరకు ప్యాకేజీ కింద బస్సులు పంపిస్తామన్నారు. పెద్దలకు రూ.850, పిల్లలకు రూ. 500 చొప్పున ఛార్జీ ఉంటుందని వివరించారు.
RTC Special Buses | కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు..
అలాగే కామారెడ్డి నుంచి హైదరాబాద్ బిర్లా మందిర్ (Birla Mandir), సాలార్జంగ్ మ్యూజియం (Salar Jung Museum), చార్మినార్(Charminar,), జూపార్క్ వరకు సందర్శించి తిరిగి కామారెడ్డికి వచ్చేందుకు పెద్దలకు ఒక్కొక్కరికి రూ.500, పిల్లలకు రూ.300 చొప్పున ఛార్జీ చేస్తామని వివరించారు.
ఆదివారం, సెలవు రోజులతో పాటు గ్రూప్‌గా ఎవరు వచ్చినా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కామారెడ్డి పట్టణ, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, బస్సులు కావాల్సిన వారు 7382851280, 7382843747, 8382843783, 08468220281 నంబర్లను సంప్రదించాలని సూచించారు.