అక్షరటుడే, వెబ్‌డెస్క్: Goa | తెలంగాణ (Telangana)లో ఇటీవల డ్రగ్స్ దందా విపరీతంగా సాగుతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్న వారి ఆట కట్టిస్తున్నారు. అయితే వీరికి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు (Narcotics Bureau officials) కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.
గోవాలో 4 డ్రగ్స్ ముఠాలను తెలంగాణ అధికారులు పట్టుకున్నారు. పబ్‌లలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. 70 మంది డ్రగ్స్ పెడ్లర్స్ స్థావరాలపై దాడులు చేశారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ (Hyderabad)లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు అందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గోవాలో అల్ప్రాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లయ్ చేస్తున్న మరో ముఠాను సైతం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.