అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia offer India | చిరకాల మిత్ర దేశమైన రష్యా భారత్ రక్షణ రంగంలో ఎంతో కీలకంగా మారింది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (S-400 air defense system) సహా ఎన్నో కీలక ఆయుధాలను అందించి మన రక్షణను బలోపేతం చేసింది. తాజాగా రష్యా భారత్‌కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యాధునిక ఫిఫ్త్ జెనరేషన్ యుద్ధ విమానం ఎస్‌యూ-57ఈ (fighter aircraft SU-57E) స్టెల్త్ ఫైటర్ జెట్న్ సోర్స్ కోడ్‌తో సహా అందజేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అమెరికా ఎఫ్-35 విమానాలను (F-35 aircraft) మనకు అమ్మేందుకు యత్నిస్తుండగా, రష్యా వాటికంటే మెరుగైన Su-57E పూర్తి యాక్సెస్ సోర్స్ కోడ్‌ను అందించేందుకు సిద్ధపడింది. ఈ సాహసోపేత ప్రతిపాదన ద్వారా భారత్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు అమెరికా ఆయుధ లాబీకి చెక్ పెట్టనుంది.
SU-57E | అధునాతన యుద్ధ విమానం Su-57E
రష్యా తయారీ యుద్ధ విమానమైన Su-57 (aircraft Su-57) శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు (air defense system) చిక్కకుండా లక్ష్యాన్ని నేరుగా ఛేదించగలదు. అధునాతన టెక్నాలజీ దీని సొంతం. రష్యా Su-57 ఫెలాన్, మొదటి ఐదో తరం యుద్ధ విమానం, స్టెల్త్ లక్షణాలను క్లోజ్-క్వార్టర్స్ పోరాటం కోసం సూపర్ మ్యాన్యువాలిటీతో రూపొందింది. శత్రు విమానాలకు(enemy aircraft) చిక్కకుండా, రాడార్‌ను జామ్ చేసే అవకాశం లేకుండా Su-57E స్వేచ్ఛగా తన పని పూర్తి చేసింది. ఎంతో కీలకమైన Su-57E సోర్స్ కోడ్ సహా రష్యా (Russia) అందిస్తుండడం వలన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ ఏవియానిక్స్, ఆయుధాలను ఏకీకృతం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఇతర పాశ్చాత్త దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికంటే అత్యుత్తమంగా మారుతుంది. అమెరికా తన F-35Aను మనకు అమ్మేందుకు సిద్ధమైన తరుణంలో రష్యా (Russia) ఈ భారీ ఆఫర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీవ్రమైన పోటీని ఎత్తిచూపుతోంది.
SU-57E | భారతదేశానికి రష్యా ధైర్యంగా పిచ్
గేమ్-ఛేంజర్‌గా పరిగణించే Su-57E ఫైటర్ జెట్లను (Su-57E fighter jets) రష్యా భారత్‌కు ఆఫర్ చేయడం చాలా మంచి పరిణామమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. Su-57E ఫైటర్ జెట్‌కు ఇండియా తన సొంత ఆయుధాలు (own weapons), వ్యవస్థలను జోడించడం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత శత్రుదుర్భేద్యంగా మారుతుందని పేర్కొంటున్నారు. సోర్స్ కోడ్ ఇవ్వడానికి రష్యా (Russia) సిద్ధపడిన తరుణంలో Su-57E ఫైటర్ జెట్ విమానాలను పూర్తిగా మనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి లోతైన యాక్సెస్ చాలా అరుదుగా ఇస్తుంటారు. US లేదా ఫ్రాన్స్ వంటి దేశాలు సాధారణంగా తమ ఫైటర్లను విక్రయించేటప్పుడు సోర్స్ కోడ్ ఇవ్వడానికి అనుమతించవు.