అక్షరటుడే, వెబ్‌డెస్క్: INS Arnala | దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు భద్రతా బలగాలకు సరికొత్త బలాన్ని అందిస్తున్నాయి. తాజాగా నేవీ అమ్ముల పొదిలోకి ఐఎన్ ఎస్ అర్నాలా చేరింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ యుద్ధ నౌకను గత నెలలో నేవీకి అందజేసినట్లు రక్షణ శాఖ(Defense Department) తెలిపింది. అర్నాలా జలాంతర్గమి ఎనిమిది ASW-SWC (యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్) నౌకల్లో మొదటిది. దీనిని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించింది. మే 8, 2025న కాట్టుపల్లిలోని M/s L&T షిప్‌యార్డ్‌లో భారత నౌకాదళానికి అప్పగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) అధికారిక ప్రకటనలో తెలిపింది.
INS Arnala | అధునాతన యుద్ధ నౌక..
ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (IRS) వర్గీకరణ నియమాల ప్రకారం ఈ యుద్ధనౌకను GRSE, L&T షిప్‌యార్డ్‌ల పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద నిర్మించారు. మహారాష్ట్రలోని వసాయి సమీపంలో ఉన్న చారిత్రాత్మక కోట ‘అర్నాలా'(Arnala) పేరు మీదుగా ఈ నౌకకు పేరు పెట్టారు. ఈ నౌకకు మహారాష్ట్రలోని వసాయి సమీపంలోని చారిత్రాత్మక అర్నాల కోట పేరు పెట్టారు. 1737లో చిమాజీ అప్పా నేతృత్వంలో మరాఠాలు నిర్మించిన ఈ కోట ఒకప్పుడు వైతర్ణ నది ముఖద్వారాన్ని మరియు ఉత్తర కొంకణ్ తీరాన్ని కాపాడింది. దాన్ని స్మరించుకుంటూ యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టారు. ఇది భారతదేశపు గొప్ప నావికా వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 77 మీటర్ల పొడవున్న ఈ యుద్ధనౌక, డీజిల్ ఇంజిన్-వాటర్‌జెట్ కలయికతో నడిచే అతిపెద్ద భారత నౌకా యుద్ధనౌక.
ఈ నౌకను జలాంతర్గామి నిఘా, శోధన, రెస్క్యూ కార్యకలాపాలతో పాటు తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాల (LIMO) కోసం రూపొందించారు. ఈ నౌక తీరప్రాంత జలాల్లో ASW కార్యకలాపాలను, అధునాతన సామర్థ్యాలను నిర్వహించగలదు. ASW SWC నౌకల చేరిక భారత నౌకాదళపు నీటి యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని రక్షణ శాఖ తెలిపింది.
INS Arnala | పూర్తి స్వదేశీ టెక్నాలజీతో..
అర్నాల యుద్ధనౌకను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించారు. 80% కంటే ఎక్కువ స్వదేశీ సామగ్రితో ‘ఆత్మనిర్భర్ భారత్'(Aatmanirbhar Bharat) అనే ప్రభుత్వ దార్శనికతను నిలబెట్టడంతోపాటు, స్వదేశీ నౌకానిర్మాణం కోసం భారత నావికాదళం చేస్తున్న అన్వేషణలో అర్నాలా డెలివరీ మరో మైలురాయి. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించనున్న ఎనిమిది ASW SWC (యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్) లలో మొదటిది అర్నాలా. ఇండియన్ నేవీ జూన్ 18న విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్.. షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) సిరీస్ కింద మొదటి యుద్ధనౌక ‘అర్నాల’ను కమిషన్ చేయనుంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్(General Anil Chauhan) ఈ యుద్ధనౌకకు అధ్యక్షత వహిస్తారు. “ఈ యుద్ధనౌక 80 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), L&T, మహీంద్రా డిఫెన్స్, MEIL వంటి ప్రముఖ భారతీయ రక్షణ సంస్థల నుంచి అధునాతన వ్యవస్థలను అనుసంధానిస్తుంది” అని నేవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 77 మీటర్ల పొడవు, 1,490 టన్నులకు పైగా బరువున్న ‘అర్నాల’ డీజిల్ ఇంజిన్-వాటర్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడిచే అతిపెద్ద భారతీయ నావికా యుద్ధనౌక(Indian Navy warship)గా నిలువనుంది.