అక్షరటుడే, వెబ్డెస్క్: Satyasai District | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Sathya Sai district) దారుణం చోటు చేసుకుంది. ఓ దళిత బాలికపై 13 మంది యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
బాధిత బాలిక గర్భం (pregnant) దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని (Ramagiri mandal) ఓ గ్రామానికి చెందిన దళిత బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట పడ్డాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు.
బాలికను అత్యాచారం చేసిన అభిషేక్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. దీంతో అతడి మరో మిత్రుడు బాలికపై అత్యాచారం చేశాడు. అంతేగాకుండా దురఘాతాన్ని మరో స్నేహితుడితో వీడియో తీయించాడు. ఈ వీడియోను చూయించి బెదిరిస్తూ 13 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Satyasai District | పోలీసులకు ఫిర్యాదు చేయకుండా..
బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. కొందరు గ్రామ పెద్దలు పంచాయితీ పేరుతో బాలికతో పాటు, తల్లిదండ్రులను గ్రామ సమీపంలోని గుట్టల్లో నిర్భందించారు. కుటుంబం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, సీఐ శ్రీధర్ గాలింపు చర్యలు చేపట్టి బాధిత కుటుంబాన్ని రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.