అక్షరటుడే, వెబ్‌డెస్క్ :AIG Hospital | హైదరాబాద్ (Hyderabad City) నగరంలోని గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆస్పత్రిలో శనివారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ విభాగం (Emergency department) వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అంబులెన్స్( Ambulance) కాలిబూడిద అయింది. వాహనం నుంచి పొగలు రావడంతో రోగులు, రోగుల బంధువులు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.