ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​JEE Advanced | లాంగ్​ టర్మ్​ కోచింగ్​ లేకుండానే ర్యాంకు సాధించా.. జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్​...

    JEE Advanced | లాంగ్​ టర్మ్​ కోచింగ్​ లేకుండానే ర్యాంకు సాధించా.. జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్​ సంకీర్త్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: JEE Advanced | అధ్యాపకుల ప్రత్యేక శ్రద్ధతో పాటు ప్రణాళిక ప్రకారం చదవడంతో ఎలాంటి లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుకోకుండానే జేఈఈ అడ్వాన్స్​డ్​లో జాతీయ స్థాయి ర్యాంకు (national level rank) సాధించానని ఎం.సంకీర్త్​ తెలిపాడు. తొలి ప్రయత్నంలోనే ర్యాంకు పొందానని చెప్పాడు. తాను ఉత్తమ ర్యాంకు సాధించడంలో కాకతీయ ఒలింపియాడ్ లోని (Kakatiya) ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, వారాంతపు పరీక్షలే ముఖ్య కారణమన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాల్లో (JEE Advanced results) ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థి సంకీర్త్​ మనోగతం..

    JEE Advanced | తొలిప్రయత్నంలోనే సాధించా..

    ‘జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాల్లో (JEE Advanced results) తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించగలిగాను. ఇందుకు కాకతీయ అధ్యాపకుల బోధన ఎంతో ఉపయోగపడింది. ప్రతి సబ్జెక్టుపై అనుభవజ్ఞులైన అధ్యాపకులతో (experienced teachers) శిక్షణ అందించడంతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించడం వల్ల లాంగ్​ టర్మ్​ కోచింగ్​కు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పరవేక్షణ ఉండడం.. ప్రతి సబ్జెక్టుపై కూలంకషంగా బోధించడంతో పాటు విద్యార్థుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేయడం వల్ల సబ్జెక్టులపై పూర్తి పట్టుసాధించగలిగాను.

    JEE Advanced | ప్రణాళికతో ముందుకు సాగాను

    ‘కాకతీయ​లో పాఠశాల స్థాయి నుంచే జేఈఈ, ఐఐటీ ఫౌండేషన్ (JEE and IIT Foundation) శిక్షణ అందుకున్నాను. లెక్చరర్లు చక్కని ప్రణాళికతో మాకు టీచింగ్​ చేశారు. వారి శిక్షణతోనే జేఈఈ అడ్వాన్స్​డ్​లో (JEE Advanced) ర్యాంకు సాధించగలిగాను. నిత్యం ప్రణాళిక ప్రకారం చదువుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అని సంకీర్త్ తెలిపాడు. విద్యార్థులు ఆల్​ ఇండియా ర్యాంకులు సాధించాలంటే.. స్కూల్​ స్థాయిలోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒలంపియాడ్​ విద్య (Olympiad education) అందిస్తే తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలన్నదే నా ఆశయం.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...