Mla Dhanpal
Mla Dhanpal | ప్రజలను చైతన్యపర్చేలా కవితలు రాయడం అభినందనీయం

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | కవులు ప్రజలను చైతన్యపర్చేలా కవితలు రాయాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్​ రచించిన ‘కర్మజీవి’ (Karma jeevi) కవితా సంపుటిని శనివారం ఆయన ఆవిష్కరించారు. స్థానిక మార్కండేయ కల్యాణ మండపంలో (Markandeya Kalyana Mandapam) కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి రచనలకు ఉందన్నారు. కార్యక్రమంలో కవులు గణపతి అశోక్​ శర్మ (Poet Ganapati Ashok Sharma), కాసర్ల నరేష్​ రావు, వీపీ చందన్​ రావు, శ్రీమన్నారాయణ, వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్ (Doctors Boddula Rajendra Prasad), నగర పద్మశాలి సంఘం (Padmashali Sangham) అధ్యక్ష, కార్యదర్శులు పెంట దత్తాద్రి, చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు.