అక్షరటుడే, వెబ్డెస్క్ :Jagtial | జగిత్యాల జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం(Major fire accident) చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా థరూర్లోని ప్లాస్టిక్ పాత సామాను గోడౌన్, టైల్స్ షాప్లో మంటలు చెలరేగాయి. ప్లాస్టిగ్ సామగ్రి గోడౌన్(Plastic equipment godown) కావడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
