ePaper
More
    HomeతెలంగాణBhu Mitra | రైతుల సందేహాలు తీర్చే ‘భూ మిత్ర’

    Bhu Mitra | రైతుల సందేహాలు తీర్చే ‘భూ మిత్ర’

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu mitra | భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భూభారతి (Bhu Bharati) చట్టాన్ని తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. రైతుల సందేహాలను తీర్చేందుకు ‘భూ భారతి’ పోర్టల్‌(bhu Bharati Portal)లో ‘భూ మిత్ర’ చాట్‌బాట్‌నును సైతం అందుబాటులోకి తెచ్చింది.

    గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి (Dharani portal) వెబ్‌సైట్‌లో లోపాల వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సర్వే నంబర్లు తప్పుగా నమోదవడం, భూ విస్తీర్ణంలో వ్యత్యాసం, పట్టా పాస్‌బుక్కు(Passbook)లు రాకపోవడంతో వేలాది మంది రైతులు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రెండు నెలల క్రితం రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్‌ ప్రాజెక్టు(Pilot project)గా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది.

    Bhu Mitra | రెవెన్యూ సదస్సులతో..

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని అమలు చేస్తోంది. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా సందేహాలను నివృత్తి చేయడానికి ఏర్పాట్లు చేసింది. ‘భూ భారతి’ పోర్టల్‌లో దరఖాస్తుదారుల సందేహాలు తీర్చేందుకు ‘భూ మిత్ర’ (Bhu mitra) చాట్‌బాట్‌ను చేర్చింది. ఇది నాలుగు భాషల్లో (Four languages) అందుబాటులో ఉంది. భూములు కొనడం, అమ్మడానికి సంబంధించిన సందేహాలను టైప్‌ చేస్తే స్క్రీన్‌పై సమాధానాలు కనిపిస్తాయి. ఈ ‘భూ మిత్ర’ చాట్‌బాట్‌ తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో ఏ భాషలోనైనా సందేహాలకు సమాధానాలు ఇస్తుంది.

    Latest articles

    Nizamabad private hospital | ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి.. ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad private hospital | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...

    surrogacy case | మేడ్చల్​ సరోగసి కేసులో కీలక అప్​డేట్​.. ఆ హాస్పిటల్స్ కు నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...

    Visakhapatnam | విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Visakhapatnam | ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం (Visakhapatnam)లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. బంగాళాఖాతంలో...

    Tirumala | తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శననానికి రెండు రోజులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి దర్శనం కోసం...

    More like this