ePaper
More
    Homeటెక్నాలజీGrand Vitara Car | గ్రాండ్‌ విటారా.. అమ్మకాల్లో అదరహో..!

    Grand Vitara Car | గ్రాండ్‌ విటారా.. అమ్మకాల్లో అదరహో..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Grand Vitara Car | దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో దూసుకుపోతోంది.

    తన మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ అయిన గ్రాండ్‌ విటారా(Grand Vitara) అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మోడల్‌ మార్కెట్‌లోకి విడుదలైన 32 నెలల్లోనే 3 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. రోజూ సరాసరిన 300 యూనిట్లు అమ్ముడవుతుండడం గమనార్హం. ఇది కొనుగోలుదారుల నుంచి గ్రాండ్‌ విటారాకు (Grand Vitara) లభిస్తున్న విశేష ఆదరణకు అద్దం పడుతోంది. ఈ ఘనత సాధించడంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్‌ మరియు సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు.

    మారుతి సుజుకీ(Maruti Suzuki)పై నమ్మకం ఉంచిన 3 లక్షల మంది గ్రాండ్‌ విటారా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత తక్కువ సమయంలో ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం పరిశ్రమకు ఒక కొత్త ప్రమాణమని పేర్కొన్నారు. “నేటి పట్టణ, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న, ఆధునిక భావాలు గల వ్యక్తుల కోసం రూపొందించిన గ్రాండ్‌ విటారా.. ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక సాంకేతికత, సమగ్రమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉందని, ఇది ఒక టెక్‌ ఎస్‌యూవీగా దాని స్థానాన్ని నొక్కి చెబుతోందని” పేర్కొన్నారు.

    Grand Vitara Car | పోటీ తీవ్రం..

    మిడ్‌-సైజ్‌(Mid-size) ఎస్‌యూవీ కార్ల అమ్మకాలలో తీవ్రమైన పోటీ నెలకొంది. మార్కెట్‌ షేరు పెంచుకోవడానికి హ్యుందాయ్‌ క్రెటా (Hyundai creta), కియా సెల్టోస్‌, టాటా కర్వ్‌ ఐసీఈ తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. వాటితో పోటీ పడుతూ మారుతి గ్రాండ్‌ విటారా దూసుకుపోతోంది. సరసమైన ధర, ఎక్కువ మైలేజీ (Mileage) కారణంగా ఈ మోడల్‌ పోటీ ఇవ్వగలుగుతోంది.

    అయితే ఇటీవలి కాలంలో తన పోటీదారులతో పోల్చితే మారుతి కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌ క్రెటా మార్కెట్‌ లీడర్‌(Market leader)గా అవతరించింది. ఏప్రిల్‌లో క్రెటా పదివేలకుపైగా యూనిట్లు అమ్ముడవగా.. 7 వేల యూనిట్ల అమ్మకాలతో గ్రాండ్‌ విటారా రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు నెలలో క్రెటా 18 వేల యూనిట్లు, గ్రాండ్‌ విటారా 10 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో సాంకేతికత, పనితీరుపై మారుతి బలమైన దృష్టి సారించింది. తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ కారు అయిన ఇ-విటారా(e-Vitara)ను త్వరలో విడుదల చేయడం ద్వారా మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...