అక్షరటుడే, వెబ్‌డెస్క్:Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) నిర్మాణంపై మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈటల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9న హరీశ్‌రావు, 11న కేసీఆర్(KCR) కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్పై వ్యతిరేకత రాకుండా.. ప్రాజెక్ట్‌పై ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయడానికి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. అయితే తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)లో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ అని వివరించారు.
Harish Rao | 20 లక్షల ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరం ద్వారా తాము రాష్ట్రంలో 20.33 లక్షల ఎకరాలకు నీరు అందించామని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు అడ్డు చెప్పకుండా ఉండటానికి మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government)తో చర్చలు కూడా జరిపామన్నారు.
Harish Rao | అందుకే అంచనా వ్యయం పెరిగింది
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మల్లన్న సాగర్‌ను మొదట 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రణాళిక వేశామన్నారు. అనంతరం దానిని 50 టీఎంసీలకు పెంచినట్లు వివరించారు. దీంతోనే ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగిందని ఆయన చెప్పారు. దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్‌తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం అని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar Project)కు రూ.122 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి రూ.1183.94 కోట్లకు పెరిగిందన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రూ.40 కోట్లతో అంచనా వేస్తే రూ.4300 కోట్ల వ్యయం అయిందన్నారు. అంచనా వ్యయం 107 రేట్లు పెరిగిందని చెప్పారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జలాశయాలు పూర్తయ్యే సరికి భారీగా అంచన వ్యయం పెరిగాయన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ.80 వేల కోట్లతో డీపీఆర్ అప్రూవ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS government) దిగిపోయే నాటికి రూ. 94 వేల కోట్లు మాత్రమే అయిందన్నారు. 0.5 రేట్లు మాత్రమే అంచనా వ్యయం పెరిగిందన్నారు.