Kannappa Movie
Kannappa Movie | ‘క‌న్న‌ప్ప‌’కు తీర‌ని క‌ష్టాలు.. సినిమా అడ్డుకుంటామంటూ బ్రాహ్మ‌ణ సంఘాలు వార్నింగ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ‘క‌న్న‌ప్ప‌’కు అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు హార్డ్ డిస్క్ మాయమైందని వార్తలు వినిపించాయి. ఇదంతా మర్చిపోతున్న తరుణంలో మళ్లీ బ్రాహ్మణ సంఘాల(Brahmin communities) నుంచి ఒత్తిడి మొదలైంది. వాళ్లు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయ‌డంతో చిత్ర బృందం డైల‌మాలో ప‌డింది. మంచు విష్ణు కన్నప్ప మూవీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితేనే ఆయన కెరియర్ ముందుకు వెళ్తుంది. లేదంటే ఆయన పరిస్థితి ఆగమ్య గోచరమే. అయితే కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

Kannappa Movie | మ‌రో స‌మ‌స్య‌..

గుంటూరులో ఇవాళ(శనివారం) కన్నప్ప Kannappa సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.. మంచు మోహ‌న్ బాబు కుటుంబానికి బ్రాహ్మ‌ణుల‌ను అవ‌మానించ‌డం అల‌వాటేన‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపర్చిన వారు కన్నప్ప సినిమాలో ‘పిలక గిలక’ పాత్ర పెట్టారు. ఈ పాత్రపై ఈ రోజు జ‌రిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు మోహన్‌బాబు(Manchu Mohan Babu) కుటుంబం మానుకోవాలంటూ శ్రీధ‌ర్ ధ్వ‌జ‌మెత్తారు.

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో క‌న్న‌ప్ప నుండి పిల‌క గిల‌క (Pilaka gilaka) అనే హాస్య పాత్ర‌లని ప‌రిచ‌యం చేశారు. ఇందులో బ్ర‌హ్మానందం(Brahmanandam), స‌ప్త‌గిరి(Saptagiri) ఉన్నారు. పోస్ట‌ర్‌లో చేప‌కు ఈత‌, పులికి వేట‌, కోకిల‌కి పాట‌.. నేర్పిన గురువులు.. అడవికే పాఠాలు చెప్ప‌డానికి వ‌స్తే.. అనే డైలాగ్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు ఇవే త‌మ మనోభావాల‌ను కించ‌ప‌రుస్తున్నాయంటూ బ్రాహ్మ‌ణ సంఘాలు మండిప‌డుతున్నాయి. ఇక త్వరలో మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమం జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ కూడా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని భీమవరం(Bhimavaram village)లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జ‌రుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.