- Advertisement -
HomeUncategorizedDeepika Padukone | ఎట్ట‌కేల‌కు అల్లు అర్జున్ - అట్లీ మూవీకి హీరోయిన్ క‌న్‌ఫాం.. గ‌ట్టిగానే...

Deepika Padukone | ఎట్ట‌కేల‌కు అల్లు అర్జున్ – అట్లీ మూవీకి హీరోయిన్ క‌న్‌ఫాం.. గ‌ట్టిగానే ప్లాన్ చేశారుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్స్‌లో అల్లు అర్జున్- అట్లీ చిత్రం (Allu Arjun-Atlee film) ఒక‌టి. పాన్ ఇండియా సినిమాగా (Pan India film) రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి వ‌చ్చే ఏ అప్‌డేట్ అయినా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఈ సినిమాకు ఐకాన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సినిమాలో క‌థానాయిక‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) న‌టించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా దీపికా పాత్ర‌ను రివీల్ చేస్తూ స్పెష‌ల్ వీడియోను పంచుకుంది. వీడియో చూస్తే.. ఆవిడ వారియర్ ప్రిన్సెస్ రోల్ (warrior princess role) చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఆల్రెడీ మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆవిడకు సంబంధించి కొన్ని షాట్స్ తీసినట్టు తెలుస్తోంది.

Deepika Padukone | వాట్ ఏ అప్‌డేట్..

దీపికాతో పాటు సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని తెలుస్తుంది. మూవీలో అల్లు అర్జున్ (Allu Arjun) త్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అందులో ఒకటి ఫాదర్ క్యారెక్టర్ అయితే… మరో రెండు క్యారెక్టర్లు అన్నదమ్ములు అని, అందులో ఒక క్యారెక్టర్ హీరో అయితే మరొక క్యారెక్టర్ విలన్ అని ప్రచారం జరుగుతోంది. దీపికాతో(Deepika) పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేసారని స‌మాచారం. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor), ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Takhur) నటించనున్నట్లు తెలిసింది. తల్లయిన తర్వాత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్ధ‌మైంది.

- Advertisement -

ఇప్పటికే షారుఖ్ ఖాన్​తో(Sharukh khan) కలిసి ‘కింగ్’ సినిమాలో దీపిక నటిస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’(Spirit) సినిమాకు కూడా దీపికనే హీరోయిన్ అనుకోగా, వివిధ కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు. ‘కల్కి’ సినిమా (Kalki movie) సీక్వెల్​లో కూడా దీపిక‌నే హీరోయిన్ కాగా, ఆమె నటించడం లేదని ప్రచారం జరుగుతోంది. కానీ అవ‌న్నీ అవాస్త‌వాల‌ని దీపిక పీఆర్ టీమ్ చెబుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు దీపిక ఇటు సౌత్, అటు నార్త్‌లో బిజీ అయిపోయింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News