అక్షరటుడే, వెబ్డెస్క్: Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే(Deputy CM Eknath Shinde) ఆటోలో ప్రయాణించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళలకు సబ్సిడీపై పింక్ ఈ రిక్షాలను అందజేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు చేయూత అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) ఇటీవల ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఓ మహిళా నడుపుతున్న ఆటో రిక్షాలో ఏక్నాథ్ షిండే కొంత దూరం ప్రయాణించారు. కాగా.. షిండే తన జీవితాన్ని ఆటో డ్రైవర్(Auto driver)గా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం శివసేనలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో బీజేపీ(BJP) మద్దతుతో సీఎంగా చేసిన ఏక్నాథ్ షిండేకు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి దక్కిన విషయం తెలిసిందే.
