ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. నేడే స్వదేశానికి ప్రభాకర్...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. నేడే స్వదేశానికి ప్రభాకర్ రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు(Former SIB chief Prabhakar Rao) నేడు ఇండియాకు రానున్నారు. గతేడాది మార్చిలో కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్​ రావు అమెరికా(America)కు వెళ్లిపోయారు. నాటి నుంచి పోలీసులు ఎన్ని నోటీసులు పంపినా స్పందించలేదు. అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నాలు చేశారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాడు. అయితే దీనిపై దర్యాప్తు అధికారులు అమెరికా ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ఆయనను భారత్​(India)కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది.

    Phone Tapping Case | సుప్రీం ఆదేశాలతో..

    అమెరికా రెడ్​ కార్నర్​ నోటీసులు(America Red Corner Notices) అమలు చేసి తనను ఇండియాకు పంపుతుందని భావించిన ప్రభాకర్​రావు ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు. తన పాస్​పోర్టు ఇవ్వాలని పిటిషన్​ వేశాడు. దీంతో పాస్​పోర్ట్​ ఇచ్చి వన్​టైం వీసా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్(Hyderabad)​ చేరుకోనున్నారు. కాగా.. రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే అమెరికాలో కేటీఆర్(KTR)​ పర్యటన సందర్భంగా ఆలస్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ కేటీఆర్​తో ప్రభాకర్​ సమావేశమైనట్లు సమాచారం. కాగా.. ఈ నెల 9న సిట్(Sit) ఎదుట విచారణకు హాజరు అవుతానని ప్రభాకర్​ రావు తెలిపారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...