అక్షరటుడే, వెబ్‌డెస్క్: Group -3 Verification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ –3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 18 నుంచి గ్రూప్–3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate verification) నిర్వహిస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలోని 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ(TGPSC) గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టీజీపీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు షెడ్యూల్ రిలీజ్ చేసింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా, వెరిఫికేషన్ మెటీరియల్ మరియు షెడ్యూల్ జూన్ 10 నుంచి TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
జూన్ 18 నుంచి జూలై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కారణంగా నిర్ణీత తేదీ నాడు వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారి కోసం జూలై 9న రిజర్వ్ డేగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ(Suravaram Pratap Reddy University)లో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. జూన్ 17 నుంచి జూలై 9 మధ్య వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.