ePaper
More
    HomeతెలంగాణNiloufer Cafe | ఛాయ్​వాలాగా ప్ర‌స్థానం.. ఇప్పుడు 1500 మందికి ఉపాధి..

    Niloufer Cafe | ఛాయ్​వాలాగా ప్ర‌స్థానం.. ఇప్పుడు 1500 మందికి ఉపాధి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Niloufer Cafe | ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవాలి అంటే.. చాయ్(Chai) తాగుదామా…? అని అనుకుంటారు. ఇద్దరు మధ్య స్నేహం బలపడాలంటే ఆ చాయే వారధి. ఇంటి విషయాల నుంచి ఆఫీసు విషయాల వరకు ప్రతీది చాయ్ తాగుకుంటూ చ‌ర్చించే వాళ్లు చాలా మంది. అయితే హైద‌రాబాదీ(Hyderabad)ల‌కు చాయ్ అంటే నీలోఫ‌ర్ కేఫ్ గుర్తొస్తుంది. నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన ఈ చాయ్ దుకాణానికి కనీసం హైదరాబాదీలు ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. అంత రుచికరమైన చాయ్‌ ఇక్కడ దొరుకుతోంది. నీలోఫ‌ర్ niloufer పేరు చాలా ఫేమ‌స్ కానీ ఓనర్ బాబూరావు పేరు అంత‌గా తెలిసి ఉండ‌క‌పోవచ్చు.

    Niloufer Cafe | ఇది ప్ర‌స్థానం..

    జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి హైదరాబాద్‌కు Hyderabad వచ్చిన బాబురావు.. నీలోఫర్ చాయ్‌కి మరోపేరుగా మారిపోయారు. బాబూరావు నడుపుతోన్న ఈ నీలోఫర్ చాయ్ దుకాణం(Nilofar Tea Shop) ఎప్పుడు చూసినా కస్టమర్లతో నిండుగా ఉంటుంది.. ఈ రద్దీని చూసిన వారికి ఇక్కడ ఎంత మొత్తంలో చాయ్ అమ్ముతుండొచ్చు అనే ఆలోచన కూడా వస్తుండొచ్చు. అయితే బాబూరావు తాను నెలకు కట్టే జీఎస్టీనే రూ.25 లక్షల వరకు ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాక తమ నీలోఫర్ చాయ్ షాపులో 1500 మంది పనిచేస్తారని, వారికి రోజుకయ్యే భోజన ఖర్చులే సుమారు రూ.మూడున్నర లక్షల వరకు ఉంటాయని చెప్పుకొచ్చారు.

    అనుముల బాబూరావు 1978లో హైదరాబాద్‌లోని లక్డీకపూల్(Lakdikapool) ప్రాంతంలో ఉన్న నీలోఫర్ కేఫ్‌లో బాయ్‌గా చేరారు. తరువాత, ఆయన కష్టపడి పనిచేసి, 1993లో కేఫ్‌ను పూర్తిగా కొనుగోలు చేశారు. ఈ కేఫ్ ప్రారంభంలో ఇరానీ చాయ్, పఫ్స్, ఉస్మానియా బిస్కెట్లు వంటి వంటకాలతో ప్రసిద్ధి చెందింది. నీలోఫర్ కేఫ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉంది. ఇది 1500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇటీవల, నీలోఫర్ కేఫ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్​ (FMCG) రంగంలోకి ప్రవేశించింది. “నీలోఫర్ సుప్రీమ్ టీ పౌడర్”(Nilofar Supreme Tea Powder) అనే ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఉత్పత్తి ఆన్‌లైన్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సూపర్‌మార్కెట్లలో అందుబాటులో ఉంది. పేద వారికి ఎల్లప్పుడూ ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉండే బాబూరావు, ఈ చాయ్ దుకాణం ద్వారా బీదవారికి సాయపడుతూ ఉంటారు. ఈ చాయ్ షాపులో మిగిలిన బ్రెడ్‌లను, బిస్కెట్లను ప్రతి రోజూ పేద వారికి పంచుతుంటారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు కేఫ్‌లను పరిశీలించి, కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తారు.

    తాను చదువుకునే రోజుల్లో పడ్డ కష్టాలను ఎన్నోసార్లు బాబూరావు Babu Rao ప్రజలతో పంచుకున్నారు. చదువుకునే రోజుల్లో బుక్స్ కోసం డబ్బులు కూడా ఉండేవి కావన్నారు. పాడి ఆవును అమ్మి మరీ తండ్రి తనను చదివించారని చెప్పారు.

    నీలోఫర్ చాయ్(Nilofar Tea) ప్రత్యేకత గురించి మాట్లాడాలంటే, అది కేవలం టీ కాదు హైదరాబాద్‌ చాయ్ కల్చర్‌కి ప్ర‌తీక‌గా మారింది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే నీలోఫర్ చాయ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే ఎంతోమంది దీనికి ఫిదా అవుతారు. సాధారణ టీలా నీటి మిశ్రమంగా కాకుండా, పాలలో ఎక్కువ సేపు మ‌రిగించ‌డంతో టీకి మంచి రుచీ, రంగూ వస్తుంది. అసోం లేదా వాయనాడ్ వంటి ప్రీమియం ప్రాంతాల నుంచి తెచ్చే స్పెషల్ టీ పౌడర్​తో తయారు చేస్తారు. టీ తయారీకి ప్రత్యేకంగా ట్రెయినింగ్ పొందిన టీ మాస్టర్లు ఉండడం వల్ల ఒకే టేస్ట్, ఒకే క్వాలిటీ ఎప్పుడూ ఉంటుంది.

    Latest articles

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...

    Sriram Sagar reservoir | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎనిమిది గేట్ల మూసివేత.. ఇంకా ఎన్ని ఓపెన్​ ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriram Sagar reservoir : ఉత్తర తెలంగాణ (Telangana) వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయాని(Sriram Sagar...

    More like this

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...