ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | అన్నను కోల్పోయిన చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసిన పోలీసులు.. ఎక్కడో తెలుసా!

    Uttar Pradesh | అన్నను కోల్పోయిన చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసిన పోలీసులు.. ఎక్కడో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | అన్నను కోల్పోయి.. పెళ్లి రద్దయిన ఓ యువతికి పోలీసులు(Police) అన్ని తామై వ్యవహరించారు. పెళ్లి రద్దు చేసుకున్న కుటుంబ సభ్యులతో చర్చించి దగ్గరుండి ఆమె వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లో చోటు చేసుకుంది.

    ఉత్తర ప్రదేశ్​లోని గొండాలో ఇటీవల దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని హత్య చేసి, ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే చనిపోయిన వ్యక్తి సోదరికి పోలీసులు సంరక్షకులుగా వ్యవహరించారు. దోపిడీ జరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆమె వివాహం రద్దయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అంతేగాకుండా దగ్గరుండి యువతి పెళ్లి జరిపించారు.

    గోండా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్(Vineet Jaiswal) మాట్లాడుతూ.. నెలన్నర క్రితం ఒక వ్యక్తి దోపిడీ దొంగల చేతిలో చనిపోయాడన్నారు. దోపిడీకి పాల్పడిన ఆరుగురు నిందితులలో నలుగురిని అరెస్ట్​ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పోలీస్​ ఎన్​కౌంటర్(Police encounter)​లో మృతి చెందారన్నారు. అయితే దోపిడీ తర్వాత ఆ ఇంట్లో వివాహం రద్దయిందని తమకు తెలిసిందన్నారు. కుటుంబం ఆర్థికంగా బాగా లేకపోవడంతో, పోలీసులు మరియు ఎస్​టీఎఫ్(STF)​ కొంత సహాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఆమె వివాహాన్ని జరిపించామన్నారు. కాగా పోలీసుల చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...