ePaper
More
    HomeసినిమాCourt Movie Heroine | క‌వ‌ర్ సాంగ్ కోసం ముంబై రమ్మన్నారు.. భ‌య‌ప‌డి వెళ్ల‌లేద‌న్న కోర్ట్...

    Court Movie Heroine | క‌వ‌ర్ సాంగ్ కోసం ముంబై రమ్మన్నారు.. భ‌య‌ప‌డి వెళ్ల‌లేద‌న్న కోర్ట్ బ్యూటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Court Movie Heroine | కాకినాడ శ్రీదేవి.. ‘కోర్ట్’ Court movie సినిమా చూసినవారికి ఈ బ్యూటీ బాగా సుప‌రిచితం.

    ఈవెంట్స్ లో ఈ అమ్మాయిని చూశారు గానీ, పెద్దగా పట్టించుకోలేదు. గ్లామరస్ గా కనిపించలేదు గానీ, ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకున్నారు. శ్రీదేవి(Sridevi) ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో చిన్నచిన్న వేషాలు వేసిందట . కాకినాడలో ఇంటర్ చదువుతూ.. రీల్స్ చేసుకుంటూ వెళుతున్న ఈ అమ్మాయికి అనుకోకుండా కోర్ట్ సినిమా(Court movie) అవ‌కాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. ‘జాబిల్లి’గా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్ట్ల కళ్లతోనే హావభావాలను పలికించింది. చిత్రంలో శివాజీ.. ప్రియదర్శి.. తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. తనే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.

    Court Movie Heroine | భ‌య‌ప‌డ్డాను..

    కాకినాడ(Kakinada) అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా.. అని అంతా చెప్పుకుంటున్నారు. అంజలి Anjali.. స్వాతి.. ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తరువాత, ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుంద‌ని అందరు ముచ్చ‌టించుకుంటున్నారు. ఆ మ‌ధ్య ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) శ్రీదేవికి ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని శ్రీదేవినే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు అంటూ ఒక నోట్ తో పాటు ఒక జ్ఞాపికను కూడా శ్రీదేవికి బహుమతిగా ఇచ్చింది ఇండిగో సంస్థ.” ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది ముద్దుగుమ్మ‌.

    ఇక టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ గోపిచంద్ మ‌లినేని, హ‌రీష్ శంక‌ర్‌లు Harish Shankar రానున్న రోజుల‌లో త‌న‌తో క‌లిసి సినిమాలు చేస్తామ‌ని మాట ఇచ్చార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఇదిలా ఉంటే శ్రీదేవి ఇటీవ‌ల మాట్లాడుతూ.. “ఒక బాలీవుడ్ సంగీత దర్శకుడు నన్ను సంప్రదించాడు. ఆయన నన్ను తనతో కవర్ సాంగ్ చేయమని అడిగారు . అయితే షూటింగ్ కోసం ముంబై (Mumbai) రావాల‌ని అన్నారు. నేను భయపడి వెళ్ళలేదు” అంటూ స్ప‌ష్టం చేసింది.

    Latest articles

    Nizamabad City | ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సైకిల్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు (RTC Bus)...

    Team India | ఒక్క మ్యాచ్ ఆడ‌లేదు..అయిన టీంలో చోటు.. పాపం బ్యాడ్ ల‌క్ అంటే వీరిదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Team India | భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసియా కప్ 2025 కోసం...

    Director Sukumar | సుకుమార్ కూతురికి రేవంత్ రెడ్డి స‌న్మానం.. ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేసిన సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Director Sukumar | ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన కుటుంబంతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి...

    Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​...

    More like this