అక్షరటుడే, ఇందూరు: The scorching sun | రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త 45కు చేరుకుంది.. నగరవాసులు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఉదయం నుంచే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వైద్యులు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో nizamabad temperature గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రత highest temperature 44 డిగ్రీల 44 degreesకు పైగా నమోదవుతుంది. అలాగే రాత్రి సమయంలోను 29 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండడంతో విపరీతమైన వేడి పెరిగింది. బుధవారం అత్యధికంగా 45.3 డిగ్రీలు నమోదైంది.
The scorching sun | పెరిగిన విద్యుత్ వినియోగం…
ఎండలు మండిపోవడంతో విద్యుత్ వినియోగం electricity consumption కూడా రోజురోజుకూ పెరుగుతుంది. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు నిర్విరామంగా వాడుతున్నారు. అయినా వేడి నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. అలాగే జ్యూస్, మజ్జిగ, కూల్ డ్రింకులకు గిరాకీ పెరిగింది.
The scorching sun |అల్లాడిపోతున్న వృద్ధులు..
ఏప్రిల్ లోనే 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు వేడికి తట్టుకోలేకపోతున్నారు. నాలుగు రోజులుగా వడదెబ్బ తగిలిన బాధితుల సంఖ్య కూడా పెరగడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
గత ఐదు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు
గరిష్టం కనిష్టం
42.9 29.4
43.1 29.4
43.4 28.7
45.0 29.3
44.5 29.5