ePaper
More
    Homeఅంతర్జాతీయంElon Musk | ఎలాన్​ మస్క్ సర్వే.. కొత్త పార్టీ ఏర్పాటు..! అమెరికా రాజకీయాల్లో నవశకం...

    Elon Musk | ఎలాన్​ మస్క్ సర్వే.. కొత్త పార్టీ ఏర్పాటు..! అమెరికా రాజకీయాల్లో నవశకం ఆరంభం..?

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Elon Musk | అమెరికా టెక్ దిగ్గజం, టెస్లా & X (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఓ ట్వీట్ యూఎస్​ రాజకీయ వర్గాల్లో (US political circles) సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరముందా..? అంటూ ఎలాన్​ సోషల్ మీడియా వేదికగా (social media platform) ఓ ప్రజాభిప్రాయ సర్వే చేపట్టారు.

    “అమెరికాలో నిజంగా మధ్య స్థాయి 80 శాతం ప్రజలను ప్రాతినిధ్యం వహించే కొత్త పార్టీ స్థాపన అవసరమా?” అంటూ మస్క్ అడిగిన ఈ పోలింగ్‌కి లక్షలాది మంది స్పందించడంతో, రాజకీయ చర్చలు చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో (US President Donald Trump) ఎలాన్ మస్క్ విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. ముఖ్యంగా ట్రంప్ 2.0 ప్రభుత్వం రూపొందించిన పన్ను-ఖర్చుల బిల్లుపై మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

    ఎలాన్​ దానిని “ఘోరమైన వ్యర్థ ఖర్చు బిల్లు.. ప్రజా నమ్మకాన్ని పాడు చేసే చట్టం” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో జరిగిన సంయుక్త సమావేశంలో మాట్లాడారు. “ఎలాన్‌ మస్క్(Elon Musk)కి నేను చాలా సహాయం చేశాను. కానీ, అతనిపై ఇప్పుడు నిరాశగా ఉంది” అని అన్నారు.

    మస్క్ దీనిపై మరింత ఘాటుగా స్పందిస్తూ.. “నా వల్లే ట్రంప్ గెలిచారు. లేకపోతే డెమొక్రాట్స్ హౌస్‌ను సంపూర్ణంగా ఆక్రమించి, సెనెట్‌లో 51-49 మెజారిటీ దక్కించుకునేవారు” అంటూ ‘X’ వేదికగా ఎలాన్​ ట్వీట్ చేశారు.

    Elon Musk | పొలిటికల్ సర్వేకు స్పందన

    మస్క్ రూపొందించిన పొలిటిల్​ సర్వేకు (political survey) జనం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. మరికొందరు మాత్రం అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, Duverger’s Law వంటి నిర్మాణాత్మక అడ్డంకులు ఉంటాయని గుర్తుచేశారు. ఒక యూజర్ అయితే ఏకంగా కొత్త పార్టీకి “ఆమ్ అమెరికన్ పార్టీ” (Aam American Party) అనే పేరు సూచించారు.

    Elon Musk | సర్వే కొత్త రాజకీయ ఏర్పాటుకు మస్క్ సంకేతమా..

    ఎలాన్ మస్క్ (Elon Musk) కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాలని చూస్తున్నారా.. లేదా.. అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం యూఎస్​లో ఉన్న రెండు పార్టీల వ్యవస్థపై అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన త్వరలోనే కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...