అక్షరటుడే, నిజాంసాగర్ : Bhu Barathi |రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. నిజాంసాగర్ (Nizam sagar) మండలంలోని మాగీ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సదస్సును ఆయన పరిశీలించారు. సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రతిరైతు నుంచి దరఖాస్తు స్వీకరించాలని సూచించారు. అనంతరం రైతులు అధికారులకు అందించిన దరఖాస్తులను పరిశీలించారు. తర్వాత రేషన్ సరఫరా వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను తహశీల్దార్ భిక్షపతి (Tahsildar Bhikshapathi) నుంచి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా మూడు సర్వే నంబర్ల వల్లే రైతులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ కోరారు.
