
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : 8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి (central government employees) శుభవార్త అందింది.
8వ వేతన కమిషన్ 8th pay commission 2026 జనవరి 1న అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లను సవరించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు (central government employees and pensioners) ప్రయోజనం చేకూరనుంది. ఈ కమిషన్ సిఫార్సులు 2026 జనవరి నుంచి అమలు కానున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) సిఫార్సు చేసిన 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా, కనీస జీతం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరగవచ్చు.
8th Pay Commission | జనవరి నుంచి అకౌంట్లలో..
అదే విధంగా, కనీస పెన్షన్ రూ.9,000 నుంచి రూ.25,740కి పెరగవచ్చు. ఈ కమిషన్ కింద గ్రూప్ A, B, C, D ఉద్యోగులకు వివిధ రకాల ఆరోగ్య బీమా ప్రయోజనాలను కూడా సవరించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) కింద గ్రూప్ A ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే, గరిష్టంగా రూ.1,00,000 బీమా కవరేజ్ ఉంది. గ్రూప్ B, C, D ఉద్యోగులకు వరుసగా రూ.40,000, రూ.20,000, రూ.10,000 బీమా కవరేజ్ ఉంది. ప్రస్తుత CGHS స్కీమ్‌లో (CGHS scheme) బీమా ప్రీమియం, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు (Insurance premium and monthly subscription rates) కూడా చాలా తక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఏడో వేతన సంఘంలో (7th pay Commission) బీమా కవరేజ్ పెంపు ప్రతిపాదన ఉన్నప్పటికీ, జీతాల పెంపు (salary hike) రేటు తక్కువగా ఉండడం వల్ల అది అమలుకాలేదు. 8వ వేతన కమిషన్‌లో ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
ఈ కమిషన్ సిఫార్సులు 2026 జనవరి నుంచి అమలు కావచ్చు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ ప్రక్రియ 2027 ప్రారంభంలో మొదలు కావొచ్చని అంటున్నారు. అయితే, అమలు ఆలస్యమైనా, ఉద్యోగులు, పెన్షనర్లకు (employees and pensioners) 12 నెలల బకాయిలను చెల్లిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 7వ వేతన కమిషన్ కింద 2016కి ముందు, తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకు సమాన ప్రయోజనాలు అందాయనీ, ఈ సూత్రం 8వ వేతన కమిషన్‌లో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ కమిషన్ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు, జీవన నాణ్యత కూడా మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.