ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిConstable Suspension | తాగి వాహనం నడిపిన కానిస్టేబుల్​ సస్పెన్షన్​

    Constable Suspension | తాగి వాహనం నడిపిన కానిస్టేబుల్​ సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Constable Suspension | విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ విధులకు గైర్హాజరవుతున్న సిబ్బందిపై కామారెడ్డి పోలీస్ బాస్ కన్నెర్ర చేస్తున్నారు. చిన్న తప్పు చేసినా సస్పెండ్​ చేసేందుకు వెనుకాడట్లేదు. నిజాంసాగర్ పోలీస్​స్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ (Constable Mohan Singh) సస్పెన్షన్ మరువకముందే అదే పోలీస్ స్టేషన్​కు చెందిన మరో కానిస్టేబుల్​ను ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh chandra సస్పెండ్ చేశారు.

    కానిస్టేబుల్​ రాకేష్​ గౌడ్​ను సస్పెండ్​ చేస్తూ ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్​ పోలీస్​స్టేషన్​లో (Nizamsagar Police Station) కానిస్టేబుల్​గా పనిచేస్తున్న రాకేష్​ గౌడ్​ ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. 5వ తేదీన పోలీస్​స్టేషన్​ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.

    డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్​ (Drunk and Drive Test) చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఎస్సై ఇచ్చిన నివేదిక ఆధారంగా శుక్రవారం రాకేష్​ గౌడ్​ను సస్పెండ్​ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పోలీసులు బాధ్యతారహిత ప్రవర్తన, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

    Latest articles

    Hyderabad | 20 రోజులు రెక్కీ నిర్వహించి దోపిడీ.. ఖజానా జ్యువెలరీ కేసులో ఇద్దరు అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని చందానగర్​లో గల ఖజానా జ్యువెలరీ(Khajana Jewellery)లో ఇటీవల దోపిడీ...

    Seasonal Diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంఈ నరేంద్ర కుమార్

    అక్షరటుడే, కామారెడ్డి: Seasonal Diseases | ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంఈ డాక్టర్​...

    Rajinikanth | ర‌జ‌నీకాంత్‌కి త‌మిళంలో విషెస్ చెప్పిన మోదీ.. చంద్ర‌బాబు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajinikanth | ఒక నటుడు తన స్టైల్‌తో, శ్రమతో, నిబద్ధతతో ఐదు దశాబ్దాల సినీ...

    Kamareddy | ఉప్పొంగిన కామారెడ్డి పెద్ద చెరువు.. తిలకించేందుకు తరలివస్తున్న ప్రజలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు (Kamareddy Pedda...

    More like this