అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | బీఆర్ఎస్(BRS) పార్టీపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది బీఆర్ఎస్ కాదని.. డీఆర్ఎస్ అని పేర్కొన్నారు. డీఆర్ఎస్ అంటే దెయ్యాల రాజ్య సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీలో దెయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే చెప్పారన్నారు. జవాబివ్వలేక దెయ్యాల నేత ఫాంహౌస్‌లో నిద్ర పోతున్నారని ఎద్దేవా చేశారు. కొరివి దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం అన్నారు.
CM Revanth | ఫామ్‌హౌస్‌కు రోడ్డు కోసం..
కేసీఆర్ (kcr) ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు రోడ్డు కోసం వాసాలమర్రి గ్రామాన్ని నాశనం చేశారని సీఎం ఆరోపించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని చెప్పి ఇళ్లన్నీ కూలగొట్టారన్నారు. తర్వాత కేసీఆర్ ఆ గ్రామాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఆ వాసాలమర్రిని శ్మశానం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth | యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తాం
యాదగిరిగుట్ట (Yadagiri Gutta)ను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. మన పూర్వికుల నుంచి ఉన్న యాదగిరిగుట్ట పేరును కేసీఆర్ యాదాద్రిగా మార్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మార్చమని చెప్పారు. గుట్ట అభివృద్ధికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. గుట్టపై భక్తులు నిద్రించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురం నిర్మిస్తామన్నారు.
CM Revanth | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
ఎవరు అడ్డుపడ్డ.. మూసీ (Moosi) ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. మూసీని అభివృద్ధి చేసి నల్గొండ ప్రజలకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని ఆయన హామీ ఇచ్చారు.