అక్షరటుడే, డిచ్పల్లి : Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) చేర్పించాలని డిచ్పల్లి ఎంఈవో (Dichpally MEO) శ్రీనివాస్ సూచించారు. మండలంలోని ఘన్పూర్ గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్, యూపీహెచ్ఎస్, హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్ ఆనంద్, రామకృష్ణ, వీడీసీ సభ్యులు గంగాధర్, తిరుపతి, మహేందర్, మోహన్, గంగమోహన్ పాల్గొన్నారు.
