అక్షరటుడే, ఇందూరు: ABVP Nizamabad | ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా ఏది సాధించలేరని ఏబీవీపీ ఇందూరు విభాగ్ (ABVP Indure Vibhag) శశిధర్ అన్నారు. మావోయిజం పేరుతో మావోయిస్టులు (Maoists) సాధించింది శూన్యమన్నారు. నగరంలోని వర్ని చౌరస్తా నుంచి ఆర్ఆర్ చౌరస్తా(RR Chowrastha) వరకు శుక్రవారం నక్సలిజానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్రం తెలంగాణ ఉద్యమం కూడా అహింసా మార్గంలోనే సాధించుకున్నామన్నారు.
కొంతమంది మేధావుల రూపంలో చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్ యూనివర్సిటీకి వచ్చే పేద విద్యార్థులకు మాయమాటలు చెప్పి అడవుల్లోకి వెళ్లేట్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ (Operation Green Hunt) కొనసాగింపే ఈ ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, ప్రణీత్, సన్నీ, మున్నా, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.