ePaper
More
    Homeఅంతర్జాతీయంUS President | చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు.. ఎప్ స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందన్న మస్క్

    US President | చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు.. ఎప్ స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందన్న మస్క్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US President | ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon musk) భారీ బాంబు పేల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సరికొత్త చిక్కుల్లోకి నెట్టారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump)తో వివాదం ముదిరిన నేపథ్యంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో దుమారం రేపిన సెక్స్ స్కామ్ ఎప్ స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందని, అందుకే వాటిని బయట పెట్టడం లేదని మస్క్ ఆరోపించడం కలకలం రేపింది. ఇది అమెరికా అధ్యక్షుడిని చిక్కుల్లోకి నెట్టింది. బెస్ట్ ఫ్రెండ్స్ గా (best friends) ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇంత వైరం ముదరడం, మస్క్ నేరుగా ట్రంప్ ను టార్గెట్ గా చేసుకుని సంచలన ఆరోపణలు చేయడం అమెరికాను కుదిపేస్తోంది.

    US President | ఆసక్తి రేకెత్తిస్తోన్న ఘర్షణ వైఖరి

    మస్క్, ట్రంప్ (Musk and Trump) మధ్య నెలకొన్న ఘర్షణ వైఖరి ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. మొన్నటిదాకా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన ఈ ఇద్దరు కత్తులు దూసుకోవడం కలకలం రేపుతోంది. బిగ్ అండ్ బ్యూటీఫుల్ బిల్ ను విభేదిచడంతో మస్క్, ట్రంప్ ఇద్దరి మధ్య మొదలైన వివాదం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందోనన్న ఆందోళనతో పాటు ఆసక్తి కలిగిస్తోంది. తన సహకారం వల్లే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential election) గెలిచాడని మస్క్ అంటే.. నువ్వెంది. నువ్వు లేకపోయినా నేను గెలిచేవాడిని అంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. పైగా ఎక్కువ, తక్కువ మాట్లాడితే నీ వ్యాపార వ్యవహారాలకు సహకరించే సంస్థలపై అధిక పన్నులు వేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం వెనక్కు తగ్గని మస్క్.. భారీ బాంబు పేల్చారు. జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందని, ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఎప్ స్టీన్ సెక్స్ స్కాండల్ బయటకు తేవడంతో ఈ వ్యవహారం అమెరికాను కుదిపేస్తోంది.

    US President | ఎప్ స్టీన్ ఎవరంటే..

    ఫైనాన్షియర్గా (financier) పేరొందిన జెఫ్రీ ఎప్ స్టీన్ వ్యవహారం ఒకప్పుడు అగ్రరాజ్యాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఫైనాన్షియర్ ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేసి.. ధనవంతులకు ఎర వేసి భారీగా డబ్బు కూడబెట్టాడు. ఎన్నో ఏళ్లపాటు ఈ దారుణాలు కొనసాగాయి. యువతులను ఎరగా వేసి అమెరికా మాజీ అధ్యక్షులు (former US presidents), బ్రిటీష్ రాజవంశస్తులు, హాలీవుడ్ ప్రముఖులతో (Hollywood celebrities) సహా ఎంతో మంది బిలియనీర్లతో సంబంధాలు పెంచుకున్నాడు.

    హైప్రొఫైల్ కలిగిన అమెరికన్లకు అమ్మాయిలను సరఫరా చేస్తుండడం, ఇతని కస్టమర్లంతా బలవంతులు కావడంతో అతడ్ని టచ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. అయితే, 2005లో తన కుమార్తెను వేధించాడని ఓ వ్యక్తి ఆయనపై కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు అయింది. ఫ్లోరిడాలో (Florida) బాలికను వ్యభిచార కూపంలోకి దింపాలని యత్నించడంతో అతని పతనం ప్రారంభమైంది. ఈ కేసులో జైలుకెళ్లిన అతడు చివరికి 2019లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎప్ స్టీన్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం కాగా, అది ఆత్మహత్యే అని నిర్ధారణ కావడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. US వర్జిన్ దీవులలోని ఎప్ స్టీన్ కు ఓ ప్రైవేట్ ద్వీపం ఉండేది. “పెడోఫైల్ ఐలాండ్”గా (Pedophile Island) పిలిచే ఈ ద్వీపంలోనే ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణాన్ని నిర్వహించేవాడు.

    US President | ఎప్ స్టీన్ ఫైల్స్లో ఏముందంటే..

    ఎప్ స్టీన్ వ్యవహారంలో (Epstein affair) దర్యాప్తు జరిపిన అధికారులు కీలక వివరాలను సేకరించారు. ఎప్ స్టీన్ తన కస్టమర్ల వివరాలను నమోదు చేసుకోగా, రహస్యంగా ఉంచిన ఆ ఫైల్స్ ను విచారణ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిని భద్రపరిచారు. అయితే, వాటిని అక్కడి అధికారులు వెల్లడించడం లేదు. ఎప్ స్టీన్ కస్టమర్లలో బిలియనీర్లు (billionaires), రాజకీయ (politicians), హాలీవుడ్ ప్రముఖులు (Hollywood celebrities) ఉండడంతో ఆ ఫైల్స్ ను బయటపెడితే అల్లకల్లోలం జరుగుతుందన్న భయంతో బయటకు తీయడం లేదు.

    అదే సమయంలో అధికారులు భిన్న వాదన వినిపిస్తున్నారు. ఆ ఫైల్స్ లో చిన్నారులు, యువతులకు చెందిన సమాచారం ఉందని, వాటిని బయటపెడితే వారి ప్రైవసీకి భంగం కల్గించినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే వెల్లడించడం లేదని అధికారులు చెబుతున్నారు. చాలా రోజులు క్రితం జరిగిన ఈ వ్యవహారం అంతా మరిచిపోగా, ట్రంప్ తో విబేధాల నేపథ్యంలో మస్క్ తాజాగా బయటకు తెచ్చారు. ట్రంప్ కూడా ఎప్ స్టీన్ కస్టమర్ అని, అందుకే ఆ ఫైల్స్ ను బయట పెట్టడం లేదని బాంబ్ పేల్చారు. ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపెడితే ట్రంప్ బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. “నిజంగా పెద్ద బాంబును వేయాల్సిన సమయం వచ్చింది. డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు ఎప్ స్టీన్ ఫైల్స్లో ఉంది. వాటిని బహిరంగపరచకపోవడానికి అదే నిజమైన కారణమని’’ మస్క్ Xలో పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...