ePaper
More
    HomeజాతీయంDelhi Government | సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఢిల్లీ ప్ర‌భుత్వం.. నేరుగా వైద్య ప‌రికరాలు కొన‌డం...

    Delhi Government | సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఢిల్లీ ప్ర‌భుత్వం.. నేరుగా వైద్య ప‌రికరాలు కొన‌డం నిషేధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Delhi Government | ఢిల్లీ ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని ఆసుపత్రులు.. వైద్య పరికరాలు, వినియోగక‌ర‌మైన‌ వస్తువులు, పరికరాలు మరియు యంత్రాలను నేరుగా కొనుగోలు చేయకుండా ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారా మాత్రమే అన్ని కొనుగోళ్లు చేయాలని కోరింది. అన్ని కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే GeM (Government e-Marketplace) పోర్టల్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.

    Delhi Government | ఊహించ‌ని నిర్ణ‌యాలు..

    • ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కారణాలు ఏమిటంటే.. తొలి కారణం.. ధరల పెరుగుదలతో కొన్ని ఆస్పత్రులు (Hospitals) నేరుగా కొనుగోలు చేయడం వల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి.
    • రెండోది పరిశీలన లోపాలు.. కొన్ని పరికరాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని నేప‌థ్యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
    • మూడోది ఆడిట్ లోపాలు.. కొన్ని ఆస్పత్రులు ఆడిట్ ప్రమాణాలను పాటించకపోవడం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
    • కొత్త విధానం ప్రకారం కేంద్ర ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ (CPA) అన్ని కొనుగోళ్లను నిర్వహిస్తుంది. ఆస్పత్రులు తమ అవసరాలను CPAకు తెలియజేస్తాయి. తక్షణ అవసరాలు ఉన్న‌ప్పుడు మాత్రమే ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. కానీ CPA అనుమతి అవసరం.
    • ఈ విధానాన్ని పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరికరాల కొనుగోళ్లలో పారదర్శకత, నాణ్యత, మరియు ఖర్చుల నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మ‌రో వైపు ఢిల్లీ ప్ర‌పంచంలోని అత్యంత కాలుష్య న‌గ‌రం(Most polluted city)గా గుర్తించ‌బ‌డింది. ఈ క్ర‌మంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకంగా ఉన్న పాత పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధానికి సిద్ధమవుతోంది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...