Mla Rakesh Reddy
Mla Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి పేర్కొన్నారు. మాక్లూర్​ (makloor mandal) మండలంలోని మామిడిపల్లిలో (mamidipally village) మండల అధ్యక్షురాలు మమత రాజేశ్వర్​ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘మా కే నాంపే ఏక్​ పేడ్​’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన బూటకపు హామీలను ఎండగడతామన్నారు. రాబోయే 25 రోజులు బీజేపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, జిల్లా కో కన్వీనర్​ గంగోనే సంతోష్, కొత్తూరు గంగాధర్​, శివలాల్​, బొబ్బిలి రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.