ePaper
More
    Homeటెక్నాలజీPhone Pay | త్వరలో ఫీచర్‌ ఫోన్లలోనూ ఫోన్‌పే సేవలు!

    Phone Pay | త్వరలో ఫీచర్‌ ఫోన్లలోనూ ఫోన్‌పే సేవలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Phone Pay | దేశంలో ఆన్‌లైన్‌ (Online payments) చెల్లింపులకు ఆదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. యూపీఐ(UPI)ని ప్రవేశపెట్టాక దీని స్పీడ్‌ మరింత పెరిగింది.

    చిల్లర సమస్య లేకపోవడంతో చిరు వ్యాపారులూ వీటికి ఓకే చెబుతున్నారు. పేటీఎం (Paytm), ఫోన్‌ పే (phone pay and Google pay) వంటి సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ మారుమూల గ్రామాలలోనూ క్యూఆర్‌ కోడ్‌లు అందించి ఆన్‌లైన్‌ ట్రాన్జాక్షన్స్‌(Online transactions)కు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి.

    ప్రస్తుతం చిన్నచిన్న అవసరాలకూ ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. దీంతో దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు ఎక్కువయ్యాయి. అయితే స్మార్ట్‌ ఫోన్‌ (Smart phone) ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్‌ ఫోన్‌ (Feature phone)లలో యూపీఐ ఆప్షన్‌ లేకపోవడంతో ఆ ఫోన్లు వినియోగించేవారు ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయలేకపోతున్నారు. కొన్ని నోకియా ఫోన్లలో యూపీఐ ఐడి (upi id payment) ద్వారా పేమెంట్స్ చేసుకునే సౌకర్యం ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు.

    Phone Pay | కీలక నిర్ణయం తీసుకున్న ఫోన్ పే

    ఈ నేపథ్యంలో ఫీచర్ ఫోన్ వినియోగించే వారిని దృష్టిలో ఉంచుకుని ఫోన్‌పే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన జస్‌పే (Juspay) అనే టెక్నాలజీ కన్వర్జేషనల్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫ్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసింది. దీని సహాయంతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి కొత్త ఫీచర్‌ ఫోన్లతో ఆ యాప్‌ సేవలను అందించే యోచనలో ఉంది.

    ఫీచర్‌ ఫోన్ల కోసం తీసుకువచ్చే యాప్‌ ద్వారా పీ2పీ లావాదేవీలతో పాటు ఆఫ్‌లైన్‌ క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు, మొబైల్‌ నంబర్‌ ద్వారా ఇతర యూపీఐ వినియోగదారులతో చెల్లింపులు చేయడం వంటి ఫీచర్లు అందుబాటులోకి తెచ్చే యోచనలో ఫోన్‌పే (Phone Pay) ఉంది. ఈ ఏడాది చివరికల్లా ఫీచర్‌ ఫోన్లతో ఫోన్‌పే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....