PDS Rice
PDS Rice | వంద క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్షరటుడే, కామారెడ్డి: PDS Rice | పట్టణంలోని రాజీవ్​నగర్ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ అధికారులు (CCS Officers) పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజీవ్​నగర్ కాలనీలో డీసీఎం వ్యాన్​ను తనిఖీ చేశారు. వాహనంలో 240 బస్తాలు ఉన్నాయని.. సుమారు 110 నుంచి 120 క్వింటాళ్ల బియ్యం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీసీఎంను సీజ్​ చేసిన అధికారులు వ్యాన్​తో పాటు డ్రైవర్​ షేక్​ అర్బాస్​ను కామారెడ్డి పోలీస్​స్టేషన్​కు తరలించారు.