అక్షరటుడే, వెబ్‌డెస్క్: Unity Mall Vizag | విశాఖపట్నం Vizag City పర్యాటక రంగంగా బాగానే అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడ(Visakhapatnam Madhurawada)లో నిర్మించబోతున్నారు.
రాజధాని అమరావతి Ap capital Amarawati పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 2న (శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. రూ.172 కోట్లతో జీ+4 అంతస్తులతో యూనిటీ మాల్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసింది.
Unity Mall Vizag | శుభవార్త..
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూరక్తి కాగా, 2026 మార్చి నాటికి మాల్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా ఏపీ సర్కార్ కార్యాచరణ రూపొందించింది. కేంద్రం రూ.172 కోట్లను 50 సంవత్సరాల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. మధురవాడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 426/2లోని 5 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ మాల్ Unit mall vizag నిర్మాణం జరగనుంది.
రుషికొండ బీచ్‌కు rushi konda beech 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని దీనిని నిర్మించనున్నారు. జీ+4లోని మొదటి, రెండు అంతస్తుల్లో 62 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది.
నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్‌లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, బ్యాంకుల శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు కూడా వస్తాయి.
వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల ద్వారా (State Government) తీరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh ప్రభుత్వం తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో యూనిటీ మాల్స్ ఏర్పాటుపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా టూరిజం, హస్తకళల పెంపు దిశగా ఇది పెద్ద ఆస్తిగా మారనుంది. ఈ మాల్ పూర్తయితే విశాఖలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటుగా స్థానిక ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. యూనిటీ మాల్‌లు, భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి రాష్ట్ర ప్రత్యేకతను దేశవ్యాప్తంగా ప్రజల ముందు ఉంచే వేదికగా నిలుస్తుంది.