ePaper
More
    HomeతెలంగాణMeenakshi Natarajan | సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

    Meenakshi Natarajan | సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Meenakshi Natarajan | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)తో కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​ శుక్రవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో వీరిద్దరూ సుమారు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. మీనాక్షి నటరాజన్​ ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లతో సమావేశమైన విషయం తెలిసిందే. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా ఆమె నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చర్చకు వచ్చిన అంశాలపై ఆమె సీఎంకు వివరించినట్లు తెలిసింది. పార్టీ నేతల అభిప్రాయాలపై వారు చర్చించారు.

    అలాగే ఇటీవల కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​గా నియామకమైన మల్లు రవి(Mallu Ravi)పై అందిన ఫిర్యాదులపై కూడా చర్చించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై వారు చర్చించారు. కాగా.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్​(PCC President Bomma Mahesh Goud) ఢిల్లీ వెళ్లి పలువురు నేతలతో సమావేశం అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్​ పది రోజులుగా ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయా అంశాలను సీఎంకు వివరించారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా.. లేక మళ్లీ వాయిదా వేస్తారా అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...