అక్షరటుడే, కామారెడ్డి: Home Guards transfers | కామారెడ్డి జిల్లాలో హోంగార్డులను (Home Guards) బదిలీ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వీరిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం హోంగార్డులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హోంగార్డుల విల్లింగ్ స్టేషన్లు, వారి సీనియారిటీని, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రాన్స్ఫర్స్ చేశామని తెలిపారు. కౌన్సిలింగ్ పద్ధతిలో పారదర్శకంగా బదిలీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, స్వయంగా ఆఫీసులో వచ్చి తనను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు.
Home Guards transfers | పోలీస్ ఉద్యోగం క్రమశిక్షణతో కూడినది..

పోలీస్ శాఖలో(Police Department) ఉద్యోగం క్రమశిక్షణతో కూడినదని ఎస్పీ గుర్తు చేశారు. హోంగార్డులను జనరల్ డ్యూటీ, బ్లూ కోట్స్, ట్రాఫిక్ వంటి విభాగాల్లో నియమించామని చెప్పారు. వారు తమ కేటాయించిన విభాగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఆర్వోలు నవీన్ కుమార్, కృష్ణ, హోంగార్డ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.