అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని ట్రంప్ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ వర్సిటీ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ట్రంప్ ప్రకటనపై తాత్కాలిక నిషేధం విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Donald Trump | జాతీయ భద్రత కోసం అని..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల (Foreign Students) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టూడెంట్ వీసాల(Student visa) జారీని అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని వర్సిటీ సరిగా తమకు నివేదించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ముగ్గురు విద్యార్థుల సమాచారంలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్ట్(Federal Court) తాత్కాలిక నిషేధం విధించింది.
Donald Trump | కోర్టుల్లో చుక్కెదురు
ట్రంప్(Trump) రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు కోర్టుల్లో ఆయనకు చుక్కెదురైంది. గతంలో సైతం ట్రంప్ 1200 మంది విదేశీ విద్యార్థుల వీసా, చట్టబద్ధ హోదాను రద్దు చేశారు. ఈ విషయంలో సైతం కోర్టు ట్రంప్ తీరును తప్పు పడుతూ.. విద్యార్థులకు ఊరట కలిగించింది.