ePaper
More
    HomeసినిమాShine Tom Chacko | ఘోర రోడ్డు ప్రమాదం.. దసరా విలన్ తండ్రి కన్నుమూత, నటుడికి...

    Shine Tom Chacko | ఘోర రోడ్డు ప్రమాదం.. దసరా విలన్ తండ్రి కన్నుమూత, నటుడికి గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Shine Tom Chacko | మలయాళ నటుడు,నాని నటించిన దసరా చిత్రంలో విలన్‌గా న‌టించిన‌ షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోగా, టామ్‌ చాకో, ఆయన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) సమీపంలోని ధర్మపురిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. అస‌లు ప్రమాదం ఎలా జ‌రిగింది అంటే.. శుక్రవారం తెల్లవారుజామున షైన్ టామ్ చాకో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. కారులో చాకో తల్లిదండ్రులు, సోదరుడు మరియు డ్రైవర్ ఉన్నారు. అయితే తమిళనాడులోని ధర్మపురి సమీపంలో సేలం-బెంగళూరు(Bangalore) జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది.

    Shine Tom Chacko | పెద్ద ప్ర‌మాదం..

    వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో షైన్ రెండు చేతులు విరిగిపోయినట్లు సమాచారం. గాయపడినవారిని పాల్కోట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో Car Accident ఉన్న ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలిసిన మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, షైన్ టామ్ చాకో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లోనూ చాకో నటించారు. దసరా సినిమాలో విలన్‌గా నటించారు. ఇటీవల డ్రగ్స్‌ కేసులో Drugs case అరెస్టై విడుదలైన చాకో.. ఇవాళ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తండ్రి మృతి చెందగా.. షైన్, అతడి తల్లి గాయపడ్డారు. వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

    More like this

    Stock Market | స్తబ్ధుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...