అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akhil-Zainab Marraige | అక్కినేని ఇంట పెళ్లి సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా అఖిల్ (Akhil) పెళ్లి గురించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం మూడు గంటలకి అఖిల్- జైనబ్(Akhil- Zainab) మెడలో మూడు మూళ్లు వేశాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. సుశాంత్ కూడా బరాత్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఇక రాజమౌళి తనయుడు కూడా తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
Akhil-Zainab Marraige | ఘనంగా పెళ్లి…
అఖిల్, జైనబ్ పెళ్లి వేడుకలకు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi, సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్, సహా తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో ఘనంగా రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా పాల్గొనే అవకాశం ఉందట. ఇప్పటి వరకు అఖిల్ పెళ్లికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.
నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా కొన్ని పెళ్లి ఫోటోలు వదులుతాడేమోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ Engagement అయిన విషయం తెలిసిందే. అప్పుడు నాగ్(Nagarjuna) తన సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వదిలాడు. ఇక పెళ్లి ఫొటోలని కూడా నాగార్జుననే తన సోషల్ మీడియా ద్వారా రివీల్ చేస్తాడని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. విడుదలకు రెడీ అవుతుంది.