ePaper
More
    HomeజాతీయంIRCTC | ఐఆర్‌సీటీసీ స్పెష‌ల్ ప్యాకేజ్.. హైద‌రాబాద్ టూ అరుణాచ‌లం

    IRCTC | ఐఆర్‌సీటీసీ స్పెష‌ల్ ప్యాకేజ్.. హైద‌రాబాద్ టూ అరుణాచ‌లం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IRCTC | ఐఆర్‌సీటీసీ (IRCTC) ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్యాట‌కుల కోసం ప్ర‌త్యేక ప్యాకేజ్‌లు అందిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా “అరుణాచల మోక్ష యాత్ర”(Arunachala Moksha Yatra) టూర్ ప్యాకేజీని ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అరుణాచలానికి భక్తులు వెళ్తూ ఉంటారు. వీరికోసం ఐఆర్‌సీటీసీ కాచిగూడ(Kachiguda) నుంచి ఈ యాత్రలో పుదుచ్చేరిలోని చారిత్రక ప్రాంతాలు, బీచ్ లో గడపడంతో పాటుగా అరుణాచలం, కాంచీపురం సందర్శించేలా వీలు క‌ల్పించింది. అరుణాచల మోక్ష యాత్ర ద్వారా అరుణాచలం, పుదుచ్చేరి, కాంచీపురం సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

    IRCTC | స్పెష‌ల్ ప్యాకేజ్..

    5 రోజులు (4 రాత్రులు) కొనసాగే ఈ యాత్రను హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి ప్రతి గురువారం నిర్వహిస్తోంది. ప్యాకేజ్ ధ‌ర‌లు చూస్తే 3AC : డబుల్ షేరింగ్ రూ.20,060, ట్రిపుల్ షేరింగ్ రూ.15,160, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ రూ.11,750, వితవుట్ బెడ్ రూ.9,950 టిక్కెట్ ధర నిర్ణయించింది. అదే విధంగా SL(స్లీపర్) : డబుల్ షేరింగ్ రూ.17,910, ట్రిపుల్ షేరింగ్ రూ.13,460, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ రూ.9,590, వితవుట్ బెడ్ రూ.7,800 టిక్కెట్ ధర నిర్ణయించింది. యాత్రలో (arunachalam moksha yatra) భాగంగా తొలిరోజు కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station) నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు (17653) బయల్దేరుతుంది.

    READ ALSO  CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    రాత్రి మొత్తం ప్రయాణం చేసి, రెండో రోజు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుని అక్క‌డ హోటల్ చెకిన్ అయిన తర్వాత అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్(Paradise Beach) చూసి రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం చేసిన వెంటనే అక్కడి నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించి తిరువన్నామలై (అరుణాచలం) చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి అక్క‌డ బ‌స చేస్తారు. నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేశాక అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కాంచీపురం(Kanchipuram) ప్రయాణం చేస్తారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వరాలయం దర్శించుకుని అక్కడి నుంచి 40 కిలో మీటర్ల దూరంలోని చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణించి 5వ రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ kachiguda స్టేషన్ చేరుకుంటారు. ఇంకెందుకు మరి ఆల‌స్యం ఈ అద్భుత ప్ర‌యాణాన్ని అస్స‌లు మిస్ కాకండి.

    READ ALSO  Bharat Gaurav Yatra | ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ.. భారత్​ గౌరవ్​ యాత్రతో ఐదు జ్యోతిర్లింగాల దర్శనం

    Latest articles

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    More like this

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...