ePaper
More
    Homeఅంతర్జాతీయంElon Musk | నావల్లే ట్రంప్‌ అధ్యక్షుడయ్యారు: ఎలాన్​ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    Elon Musk | నావల్లే ట్రంప్‌ అధ్యక్షుడయ్యారు: ఎలాన్​ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Elon Musk | టెస్లా సీఈవో(Tesla CEO), అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ (American business tycoon Elon Musk) vs యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువురి మధ్య తారాస్థాయిలో ట్విట్టర్ Twitter వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా CEO, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పరస్పర విమర్శల రూపంలో చెలరేగిన ఈ వివాదం సర్వత్రా తీవ్ర చర్చకు తెరలేపింది.

    Elon Musk : ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎలాన్ మస్క్ ట్రంప్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నా వల్లే ట్రంప్‌ అధ్యక్షుడయ్యారు. నేను లేకపోతే ఆయన గెలిచేవారే కాదు” అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ట్రంప్ 2024 విజయంలో తాను కీలక పాత్ర పోషించాననే సంకేతాలను ప్రపంచానికి తెలియజేశారు.

    Elon Musk : డొనాల్డ్ ట్రంప్ ఘాటు స్పందన

    ఎలాన్​ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై యూఎస్​ ప్రెసిడెంట్ డోనాల్డ్​ ట్రంప్ ఘాటుగా స్పందించారు. “అమెరికా బడ్జెట్‌లో బిలియన్ల డాలర్లను ఆదా చేయాలంటే.. ఎలాన్ మస్క్‌కు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలు, ఒప్పందాలను రద్దు చేయడమే సరైన మార్గం” అని ఎక్స్ లో మండిపడుతూ ట్రంప్​ పోస్ట్ చేశారు.

    దీనిపై స్పందించిన ఎలాన్​ మస్క్.. “Have a Nice Day, DJT. Mark this post for the future” అంటూ కౌంటర్​ ఇచ్చారు.

    రెండోసారి ట్రంప్ గెలిచాక.. టెస్లా, స్పేస్‌ఎక్స్‌(SpaceX) సంస్థలు పలు అమెరికన్ ప్రభుత్వ ప్రాజెక్టులు, సబ్సిడీలు పొందాయి. తాజాగా డోనాల్డ్ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఎలాన్​ మస్క్ సంస్థలకు ఇచ్చిన రాయితీలను రద్దు చేయాలనే ఆలోచన వల్లనే ఇరువురి మధ్య స్నేహం చెడినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలోని ప్రభావవంతమైన వ్యక్తి.. అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ట్రంప్ దీన్ని సీరియస్‌గా తీసుకుని ప్రభుత్వ సహాయాలపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది.

    తాజాగా ఇరువురి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం అమెరికా భవిష్యత్తు రాజకీయాలను తీవ్రంగానే ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి వ్యవహారం రాజకీయంగానే కాదు, సాంకేతిక రంగం – ప్రభుత్వ సంబంధాల మధ్య ఉన్న బలాన్నీ ప్రశ్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు మస్క్ ట్విట్టర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ లాంటి దిగ్గజాలను నడుపుతుండగా.. మరోవైపు ట్రంప్ అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్నారు. ఇంతటి ఉన్నత హోదాల్లో ఉన్న వీరు మతి బ్రమించి గొడవకు దిగడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాలు ప్రపంచ వాణిజ్య రంగంపై గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...