అక్షరటుడే, నిజాంసాగర్: Sultan nagar | నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. గతంలో సుల్తాన్‌నగర్ వాసులు రేషన్ కోసం నిజాంసాగర్ వరకు వెళ్లేవారు. ప్రభుత్వం మూణ్నెళ్ల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడారని మల్లిఖార్జున్ పేర్కొన్నారు. దీంతో అధికారులు సుల్తాన్‌నగర్‌లో రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. గ్రామంలోనే రేషన్ అందజేస్తుండడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ రహమాన్, నాయకులు బ్రహ్మం, సాయిలు, బేతయ్య, హైమద్, చాంద్ పాషా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
